విత్తనాలను రైతులకు పంపిణీ చేసిన జేసీ
1 min readరాయితీ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ దారులకు సబ్సిడీ విత్తనాలు సకాలంలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు.శుక్రవారం మండల పరిధిలోని చౌట్కూరు, మాసపేట గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆర్బికే ల ద్వారా మండలానికి సరిపడ్డ విత్తనాలను ప్రభుత్వం అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.అక్కడే ఉన్న రైతులను విత్తనాల పంపిణీ గురించి జేసీ ఆరా తీయగా తమకు విత్తనాలు సకాలంలో వ్యవసాయ అధికారులు అందిస్తున్నారని రైతులు ఆయనకు తెలిపారు.అనంతరం జేసీ ఆధ్వర్యంలో రైతులకు కంది విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎం పీరు నాయక్,ఉప్పల దడియ గ్రామ టిడిపి నాయకులు కమతం వీరారెడ్డి, కమతం రాజశేఖర్ రెడ్డి, ఆనందరావు ఆర్బికే సిబ్బంది రైతులు పాల్గొన్నారు.