PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యోగ ఒత్తిడిని దూరం చేసి మానసిక ఆరోగ్యం, ప్రశాంతత కలిగిస్తుంది

1 min read

– ఎంఈఓ గంగిరెడ్డి, ఎంపీపీ చీర్ల

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : యోగ మానసిక ఒత్తిడిని దూరం చేసి శరీర మానసిక ఆనందాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తుందని దీని ద్వారా అనేక రుగ్మతలు దూరం చేసి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుందని ఎంఈఓ గంగిరెడ్డి,ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు అన్నారు, అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధుల తో కలిసి గురువారం స్థానిక విద్యా వనరుల కేంద్రం నుండి, చెన్నూరు పురవీధులలో యోగ పై ర్యాలీ నిర్వహించారు, అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, యోగా ద్వారా రోజువారి పని ఒత్తిడి, ఆందోళన, నిరాశ , మానసిక ఒత్తిడి అనేక రుగ్మతలకు దివ్య ఔషధంగా యోగ పనిచేస్తుందని పనిచేస్తుందని ఆయన తెలిపారు, అంతేకాకుండా గుండె ఆరోగ్యంగా పనిచేసేందుకు, దీర్ఘకాలిక నొప్పుల నుండి విముక్తి చేసేందుకు యోగ ఒక చక్కటి సాధనంగా పనిచేస్తుందని వైద్య అధ్యయనాలు చెబుతున్నాయని వారు తెలిపారు, విద్యార్థి దశ నుండి యోగ పై శ్రద్ధ వహిస్తే విద్యార్థులు మానసిక ఒత్తిడి తొలిగి అన్ని రంగాలలో ముందుంటారని వారు తెలియజేశారు, యోగాలో అనేక రకాల ఆసనాలు వేయడం వల్ల శరీరంలో ప్రతి భాగం శక్తివంతం అవుతుందని అందుకే డాక్టర్లు కూడా యోగా చేయమని సలహాలు ఇవ్వడం జరుగుతుందని దీని ద్వారా మెదడు చురుకుతనంగా మారి ఆరోగ్యంతో పాటు, జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుందని వారు తెలిపారు, అనంతరం యోగా గురువు ఆర్.ఎం.పి వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లను ఈ సందర్భంగా వారు ఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో ఎంఈఓ-2 సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author