అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు యోగా డే..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తరిగోపుల గ్రామం లో గురువారం ఇంటర్నేషనల్ యోగ రోజు దినోత్సవ సందర్భంగా గ్రామంలో అంగన్వాడి సెంటర్ మరియు ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు యోగ దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పావని ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడి సెంటర్లను విజిట్ చేసి అంగన్వాడి సెంటర్లో పిల్లలకు యోగా చేయడం నేర్పించి చిన్నప్పటినుంచే యోగా చేయడం ద్వారా పిల్లలలో శారీరక శ్రమ,క్రమశిక్షణ, మేధాశక్తి,మంచి నైపుణ్యత, ఒక మంచి అలవాటు ఉంటుందని అలాగే వారు పెద్ద అయ్యాక కూడా ఈ అలవాటు కొనసాగించుకోవడం ద్వారా పిల్లల్ని ప్రతిరోజు కొన్ని సాధారణ యోగ ఆసనాలు చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఐసిడిఎస్ సూపర్వైజర్ పావని అంగన్వాడీ సెంటర్లలో వివరించి పిల్లలతో యోగ ఆసనాలు చేయించారు.మరల హై స్కూల్ నందు స్కూల్ పిల్లలకు యోగాసనం చేపించి పిల్లలకు ప్రతిరోజు యోగ చేయడం ద్వారా మంచి క్రమశిక్షణ అందుతుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ పావని, తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్వాడి టీచర్ల సమక్షంలో ప్రపంచ యోగ దినోత్సవం జరుపుకోన్న అంగన్వాడి టీచర్ శ్రీదేవి,రామ తులసమ్మ, లక్ష్మీప్రసన్న హైస్కూల్ టీచర్లు పాల్గొన్నారు.