పౌష్టిక ఆహారం అందించడంలో అధికారులు విఫలం
1 min readవిద్యార్థుల సమస్యల వెల్లువ
తాగటానికి మంచినీళ్ళు లేక విద్యార్థుల ఇబ్బందులు
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: జూన్22 పల్లెవెలుగు న్యూస్ మండల కేంద్రమైన కౌతాళంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంలో అధికారులు విఫలమయ్యారని విద్యార్థులు వాపోయారు. సరైన భోజనం లేక ఉడకని గుడ్లు భోజనంలో పురుగులు సరైన ఆహారం అందించడంలో అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మధ్యాహ్నం తింటున్న భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు అన్నారు. అలాగే ఆహారంతో పాటు వారం రోజుల నుండి త్రాగునీరు లేక మధ్యాహ్న భోజన సమయంలో త్రాగు నీరు బయట నుంచి తెచ్చుకుని తాగుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఉపాధ్యాయులకు చెప్పిన సమస్య తీరండం లేదని అన్నారు. కనీసం నీరు అందించడంలో కూడా అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు వాపోయారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్న పాఠశాలలో సరైన సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు తెలిపారు.ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పందులు కూడా వీర విహారం చేస్తున్నాయని వారన్నారు. దీనిపై జిల్లా అధికారులు వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని కోరుచున్నారు.