ఉచిత ఆర్థోపెడిక్స్ వైద్యశిబిరం
1 min readపేద రోగులకు సేవ చేయడమే లక్ష్యం
- ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డా.ఎస్. రవితేజ రెడ్డి
కర్నూలు, పల్లెవెలుగు: సమాజానికి కొంతైనా వైద్య సేవ చేయాలన్న తలంపుతో ప్రతి శనివారం ఉచిత కన్సల్టేషన్ ఆర్థోపెడిక్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎముకలు, నరముల, వెన్నముక మరియు కీళ్ల మార్పిడి శస్ర్తచికిత్స నిపుణులు డా. రవితేజ రెడ్డి తెలిపారు. స్థానిక ఎన్ఆర్ పేటలోని డా.ఎస్. రవితేజ రెడ్డి హాస్పిటల్లో శనివారం కొందరు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 45 సంవత్సరాల పైబడిన వారికి మాత్రమే ఎముకలు, నరములు, వెన్నుముక, కీళ్ల మార్పిడి కి ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా వైద్య పరీక్ష చేశారు. వైద్య పరీక్షల అనంతరం రోగులకు ఉచిత సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డా. రవితేజ రెడ్డి మాట్లాడుతూ మనిషి శరీరంలో ఎముకలు, కీళ్ల పాత్ర కీలకమన్నారు. అందుకు వైద్య చికిత్సలు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నదన్నారు. కర్నూలు, నంద్యాల, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ఉచిత వైద్య పరీక్షల కోసం వస్తుంటారని, వారందరికీ ఉచిత కన్సల్టెషన్ ఆర్థోపెడిక్ వైద్య పరీక్షలు అందజేస్తున్నామన్నారు. సంపాదించిన దానిలో కొంతైనా సేవకు వెచ్చించాలన్న ఆలోచనతోనే.. తన వంతుగా రోగులకు ఉచిత వైద్య పరీక్షలు చేస్తున్నానని పేర్కొన్న డా. రవితేజ రెడ్డి…. భవిష్యత్లో మరిన్ని వైద్య సేవలు చేసేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.