కూటమి ప్రభుత్వం డుమావత్ స్వామి నాయక్ కి నామినేటెడ్ పదవి ఇవ్వాలి
1 min read– నంద్యాల జిల్లాలో కూటమి ప్రభుత్వం గెలుపు కొరకు కష్టపడ్డా డుమావత్ స్వామి నాయక్ కి నామినేటెడ్ పదవి ఇవ్వాలని గిరిజన కార్యకర్తల డిమాండ్.
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: వెలుగోడు ఆదివారం రోజున జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో శ్రీశైలం నియోజకవర్గం లోని గిరిజన నాయకులు అందరు కలిసి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి అహర్నిశలు కష్టపడ్డాడు డుమావత్ స్వామి నాయక్ కి ఎస్టి కమిషన్ లో అవకాశం ఇవ్వాలని గిరిజనుల యొక్క డిమాండ్. ఎందుకంటే గిరిజనుల సమస్యల గురించి గతంలో చాలా వరకు గిరిజన సమస్యలు పరిష్కరించాడు కాబట్టి కచ్చితంగా డుమావత్ స్వామి నాయక్ కి ఎస్టి కమిషన్ లో అవకాశం ఇస్తే గిరిజన సమస్యలు పరిష్కరించి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని గిరిజనులు నమ్మకం. అలాగే గత 30 సంవత్సరాలు నుంచి టీడీపీ పార్టీ గెలుపు కొరకు అహర్నిశలు కష్టపడి ఎన్ ఎండి ఫారుక్ గారి గెలుపుకు మరియు శ్రీశైలం నియోజకవర్గం బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారి గెలుపు నంద్యాల జిల్లా మరియు రాష్ట్రంలో గల గిరిజన ప్రాంతాలు అన్ని తిరిగి కూటమి ప్రభుత్వం కోసం కొరకు తన వంతు సహాయ సహకారం అందించినటువంటి డుమవత్ స్వామి నాయక్ కి కచ్చితంగా ప్రభుత్వము నామినేట్ పదవి ఇవ్వాలని గిరిజనులు కోరుకుంటున్నారు.తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు కష్టపడుతూ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా నీతి నిజాయితీతో గతంలో కూడా టిడిపి రాష్ట్ర ఎస్టీ సెల్ పదవి చేపట్టిన నుండి స్వామి నాయక్ కి ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కాబట్టి ఈసారి కూటమి ప్రభుత్వం గెలుపు కొరకు కష్టపడ్డ స్వామి నాయక్ కి మంచి నామినేటెడ్ పదవి ఇచ్చి తెలుగుదేశం పార్టీ కొరకు కష్టపడ్డా కార్యకర్తలకు కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఇస్తుందని గిరిజనుల్లో ఒక నమ్మకం ఉంది. నాగరాజు నాయక్ లలిత్ కుమార్ నాయక్ కే సురేష్ నాయక్ నాగరాజు నాయక్ మళ్లీ నాయక్ ఉపేంద్ర నాయక్ రాంబాబు నాయక్ సురేష్ నాయక్ సిసింద్రీ నాయక్ రాజా నాయక్ శేఖర్ నాయక్ సునీల్ నాయక్ మహేష్ నాయక్ కిషోర్ నాయక్ నాగరాజు నాయక్ మోహన్ నాయక్ నాగు నాయక్ సుబ్బరాయుడు నాయక్ అంజి నాయక్ తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు డిమాండ్ చేశారు.