కనువిందుగా సాగిన ఒలంపిక్ డే రన్
1 min readక్రీడలు అంటే నాకెంతో ఇష్టం : మాజీ రాజ్య సభ సభ్యుడు టి. జి . వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు, స్పోర్ట్స్ న్యూస్: ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమైన ఒలంపిక్ డే సెలబ్రేషన్స్ ఆదివారం కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బురుజు వరకు ఒలింపిక్ డే రన్ కనువిందుగా సాగింది. ఆదివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటుచేసిన ముగింపు కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీ.జీ. వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్యారిస్ లో జరిగే ఒలంపిక్స్ విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. మనదేశంలో క్రీడలకు చాలా తక్కువ బడ్జెట్ కేటాయించి నిరుత్సాహపరిస్తుంది అని ఆయన అన్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి క్రీడాభివృద్ధి మన రాష్ట్రంలో కుంటుబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియం లకు కేటాయించిన స్థలాలను స్టేడియం కే చెందాలని దానిని ఈ మధ్యకాలంలో వేరే పనులకు ఉపయోగించుకుంటున్నారని ఆయన తెలిపారు. కర్నూలు క్రీడాకారులు ఆటపాటలతో సాగుతూ క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కలెక్టరేట్ , రాజ విహార్, కిడ్స్ వరల్డ్ ,కోట్ల సర్కిల్ మీదుగా కొండారెడ్డి వరకు రన్ సాగడం పట్ల నగరంలో చూపరులను ఆకట్టుకుంది. క్రీడాంశాల్లో గెలుపొందిన విద్యార్థులకు కప్పులు మెడల్స్ తో పాటు ప్రతిభాపత్రాలు అందజేసి అభినందించారు.అంతకు ముందు చిన్నటేకూరు ,డి.డి. పాడు విద్యార్థులు చేసిన కార్యక్రమాలను పలువురును అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, చైర్మన్ మహబూబ్ బాషా కెవి సుబ్బారెడ్డి , క్రీడా సంఘ ప్రతినిధులు సి హర్షవర్ధన్, దాసరి సుధీర్, గంగాధర్, జాఫర్ మున్నా, వేణుగోపాలు, షేక్ నబి సాహెబ్, నాగరత్నమయ్య, విజయ్ కుమార్, గుడిపల్లి సురేందర్, పరుశ రాముడు, నవీన్, వెంకటేష్, రాఘవేంద్ర, చిన్న సుంకన్న, ప్రసాద్, ప్రభాకర్, చంద్రమల్లి మధు, అశోక్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.