యువతిపై లైంగిక దాడి చేసిన హంతకులకు ఉరి శిక్ష అమలు చేయాలి
1 min read– రాయలసీమ శకుంతల
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం చెందిన చేనేత ఆడబిడ్డ ఇంటర్ వరకు చదివి, తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఇంటి దగ్గరే కుట్టు మిషన్వర్క్ చేసేది.శుక్రవారం ఉదయం 5.45ని”లకు తమ ఇంటికి దగ్గరలో ఉన్న బహిర్భూమికి వెళ్లి ఎంతసేపు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు వెతకగా, చెట్ల పొదల్లో ఆమె నిర్జీవంగా ఒంటిపై బట్టలు లేకుండా మొహం పై గాయాలతో ఆ తల్లిదండ్రులు అలా చూసి ఎంత ఆవేదన చెంది ఉంటారు అని రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శకుంతల మాట్లాడుతూ హంతకులు ఎవరైతే ఉన్నారో దేవరకొండ విజయ్, కారంకి మహేష్,వీరికి సహకరించిన దేవరకొండ శ్రీకాంత్ కు తక్షణమే ఉరిశిక్షలు అమలు చేయాలి అన్నారు. శిక్షలు కఠినంగా ఉంటూ, వాటిని వెంటనే అమలు చేస్తే ఇలాంటి వారికి బుద్ధి వస్తుందన్నారు. 48 గంటలలోపు నేరానికి పాల్పడిన హంతకులను అరెస్టు చేసినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదములు అన్నారు. అలాగే న్యాయస్థానంలో కూడా ఇలాంటి హంతకులకు కఠినమైన ఉరిశిక్షలు పడే విధంగా చర్యలు ఉండాలన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే వారికీ ఉరిశిక్ష న్యాయస్థానం విధిస్తే కొంతవరకు ఇలాంటివి జరగవు అన్నారు. మత్తుకు బానిసై యువకులు వారి జీవితాన్ని వారి చేతులారా నాశనం చేసుకుంటున్నారు అని అన్నారు.