రాష్ట్రానికి పరిశ్రలు రాబోతున్నాయి.. మంత్రి టి.జి భరత్
1 min readరాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ చెప్పారు. కర్నూల్లో టి.జి లక్ష్మీ వెంకటేష్ వాసవి వైశ్య హాస్టల్ నూతన ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టి.జి భరత్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తనకు మంత్రి పదవి ఇచ్చారని పేర్కొన్నారు. సరైన నాయకత్వంలేక గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని మంత్రి చెప్పారు. వారందరితో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇక కర్నూల్లో ఉన్న ఇండస్ట్రియల్ జోన్ కు పరిశ్రమలు తీసుకొచ్చేలా కృషి చేస్తామన్నారు. తనను ఆశీర్వదించిన ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.