బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలి
1 min readమంత్రులను కలసిన చింతకుంట కురుమూర్తి జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు నంద్యాల జిల్లా
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజయవాడ లోని వ్యవసాయం సహకార, మార్కెటింగ్,పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చ న్నాయుడు మరియు మైన్స్ జియాలాజి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నివాసంలో నంద్యాల జిల్లా జాతీయ బీసి సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతకుంట కురుమూర్తి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పేద రైతులకు విత్తనాల అందించాలని నకిలీ విత్తనాలు అరికట్టాలని అదే విధంగా నిరుపేద రైతులకు సబ్సిడీ రుణాల ద్వారా ఆవులు గొర్రెలు బర్రెలు ఎద్దులు ట్రాక్టర్లను అందించాలని మంత్రిని కోరారు.ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు త్వరగా అందించాలని అదే విధంగా బీసీ కమ్యూనిటీకి కార్పొరేషన్ సబ్సిడీ లోన్ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని ఆ మాటను మన ముఖ్యమంత్రి అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంప్లాయ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జాకీర్ హుస్సేన్,సీనియర్ బీసీ సంఘం నాయకులు శ్రీనివాసులు,బెస్త సంఘం రాష్ట్ర నాయకులు సుధాకర్,సుధాకర్ పాల్గొన్నారు.