మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు..
1 min readభవిష్యత్తు అంధకారం అవుతుంది.. ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య..
పల్లెవెలుగు వెబ్ గడివేముల : అంతర్జాతీయ మత్తు పదార్థాలు మాదకద్రవ్యాల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వందరోజుల మత్తుపదార్థాల మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎస్సై బీటీ వెంకటసుబ్బయ్య మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి యువత మత్తుకు దూరంగా వుండాలని , మత్తు పదార్థాల వలన చాలా నష్టాలు వున్నాయని భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లితండ్రులు మీపై పెట్టుకున్న ఆశలు అడియాసలు అవుతాయని వీటి కి దూరంగా ఉండి ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని కుటుంబాలలో సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని అవగాహన కల్పించారు ఎవరైనా మత్తు పదార్థాలు వాడిన తమకు సమాచారం ఇవ్వాలని కోరారు ఎస్సై వెంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.