PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పీడియాట్రిక్ కేసుల సీజనల్ డిసీస్‌పై సమీక్షా సమావేశం

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ఉదయం 11.00 గంటలకు, సూపరింటెండెంట్ ఛాంబర్‌లో వైద్యులు మరియు సిబ్బందితో పీడియాట్రిక్ కేసుల పీడియాట్రిక్ డిపార్ట్‌మెంట్‌లో గ్యాస్ట్రోఎంట్రీస్, డెంగ్యూ, qమలేరియా సీజనల్ డిసీస్‌కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.

 పలు అంశాలపై సమీక్షా సమావేశం

పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ మరియు HOD మరియు CRMO పీడియాట్రిక్స్ కేసులపై సంసిద్ధత మరియు చికిత్సకు పడకలు అందుబాటులో ఉన్న పడకలను తనిఖీ చేయమని మరియు పీడియాట్రిక్ కేసుల కోసం 10 పడకలు మరియు గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని  పీడియాట్రిక్ HOD కి ఆదేశించారు.పీడియాట్రిక్స్ వార్డులకు అవసరమైన వైద్యులు మరియు హౌస్ సర్జన్లు, పీజీ, మరియు సిబ్బందిని నియమించాలి అని CSRMOకి ఆదేశించారు.మందులు: సీజనల్ వ్యాధులకు అనుగుణంగా మెయిన్ స్టోర్లలో మందులు అందుబాటులో ఉన్నాయో లేదో తనిఖీ చేయమని ఫార్మసిస్ట్ సూపర్‌వైజర్‌కు ఆదేశించారు.   ల్యాబ్ రిపోర్టులను వెంటనే జారీ చేసి అందజేయాలని ARMO, CSRMO లను ఆదేశించారు. కేసుల అవసరాన్ని బట్టి నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ మొదలైన స్పెషలిస్ట్ వైద్యులను పిలవమని పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ మరియు HODకి సూచించారు.పీడియాట్రిక్ కేసుల వ్యాప్తిపై రోజువారీ డేటాను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకురావాలి అని తెలిపారు.వైద్యులు మరియు సహాయక సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలి, అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి, పీడియాట్రిక్ కేసులపై తగిన చర్యలు తీసుకోవాలి, కేసులను సమీకరించాలి మరియు సీజనల్ వ్యాధులు ప్రబలినప్పుడు ఆసుపత్రిలో మరణాలు రేటు సున్నా ఉండేటట్టుగా చూసుకోవాలి వైద్యులకు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి CSRMO, డా.బి.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO, డా.హేమనలిని, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ మరియు HOD, డా.బి.విజయ్ ఆనంద్ బాబు, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్, డా.జి.శారద, డా.సుహాసిని, పీడియాట్రిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్,  డా.ఎం.మల్లికార్జున, డా.ఎం.ప్రకాష్ కుమార్, డా.ఎస్.శ్రీలత, డా.పి.రవీంద్రారెడ్డి, ఆసుపత్రి ARMO, డా.వెంకటరమణ, నర్సింగ్ సూపరింటెండెంట్ Gr-I, శ్రీమతి S.P. సావిత్రి బాయి, ఫార్మసిస్ట్ Gr-I, శ్రీ.నరసింహారావు, శ్రీ.శర్మ, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్,  డా.సి.ప్రభాకర రెడ్డి, తెలిపారు.

About Author