3,4,5 తరగతుల విలీనం వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి కి వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: విద్యా శాఖలో పలు ఇబ్బందులకు కారణమైన జీవో 117 రద్దు చేయాలని, మూడు నాలుగు ఐదు తరగతుల విలీనాన్ని వెనక్కి తీసుకొని ప్రాథమిక పాఠశాలకు పునర్ వైభవం కల్పించాలని, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఏవీ అప్ప చెప్పకుండా విద్యా బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, ప్రస్తుతం ఉన్న అనవసరమైన యాప్స్ అన్నింటిని తీసివేయాలని, ప్రతి ఉన్నత పాఠశాలకు గ్రేడ్ 2 హెచ్ఎం మరియు పిడి పోస్టులను మంజూరు చేయాలని, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతులకు స్కూల్ అసిస్టెంట్లను నియమించాలని, డీఈవో పూల్ లో ఉన్న పండిట్ మరియు పీఈటీలకు ప్రమోషన్లు కల్పించాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలులో ఉన్న ఇబ్బందులను తొలగించి అన్ని కేడర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని, ఎంటిఎస్ 1998 మరియు 2008 ఉపాధ్యాయులను రెగులరైజ్ చేయాలని, త్వరలోనే మెరుగైన పిఆర్సి అమలకు చర్యలు తీసుకోవాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఆపస్) రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ, ప్రధాన కార్యదర్శి జీవీ సత్యనారాయణ, సంఘటన కార్యదర్శి సిహెచ్ శ్రావణ్ కుమార్, కోశాధికారి ఏం సురేష్ కుమార్, కృష్ణా జిల్లా అధ్యక్షులు బి రఘునాథ్ లు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కి ఇచ్చి సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు.విజయవాడ సెక్రటేరియట్ లో మంత్రి నారా లోకేష్ ని వారి చాంబర్ నందు కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లగా మంత్రిగారు సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులు గౌరవం సమాజంలో ఇనుమడించేలా, వారి మీద అనవసర భారం పెట్టబోమని, బోధనకే పరిమితం చేస్తామని విద్యా ప్రమాణాల పెంఫుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.