ఎన్నికలను లైట్ గా తీసుకున్నాం
1 min readగ్రూపు గొడవలే కొంపముంచాయి. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
పల్లెవెలుగు న్యూస్ గడివేముల: అసెంబ్లీ ఎన్నికలలో పాణ్యం నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి పై దాదాపు 40 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి గెలుపొందారు దీంతో ఎన్నికలలో ఓటమి చెందడానికి కారణాలపై మండలాల వారీగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మంగళవారం నాడు గడివేముల మండల కేంద్రంలోని వైసీపీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసిపి నాయకులు మాట్లాడుతూ అభివృద్ధి పథకాలు అందజేసిన ప్రజలు ఎందుకు తిరస్కరించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అయితే కొంతమంది మాత్రం గ్రామాలలో సామాన్య ప్రజలకు దూరమయ్యామని జగనన్న కాలనీలు జొన్న కొనుగోలు గృహ నిర్మాణ పథకాలలో ఏకపక్ష నిర్ణయాలపై టిడిపి భారీగా ప్రచారం చేస్తుందని ప్రజలు నమ్మి తమకు ఓటు వేయలేదని అలాగే ఇతర గ్రామాలలో నాయకులు జోక్యం చేసుకోవడం కూడా మైనస్ గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికంగా గ్రూపు గొడవలతో కలిసి మెలిసి పని చేయలేకపోయామని ఇది మొదటి కారణం కాగా గడపగడపకు వెళ్ళినప్పుడు ఒకరికి ఎక్కువ లబ్ధి కొందరికి తక్కువ లబ్ధి చేకూర్చడం వాటిని ప్రజలు గమనించడం తమకు నష్టం కలిగించిందని ఎన్నికలను లైట్ గా తీసుకోవడం కూడా తమకు నష్టం కలిగించిందని పేర్కొన్నారు. జగనన్న పై వ్యతిరేకత తమకు ఓటమి తెచ్చిపెట్టిందని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. మద్యం ఇసుక పాలసీ తమకు నష్టం కలిగించిందని పేర్కొన్నారు. అలాగే కార్యకర్తలు నాయకులు ధైర్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని ప్రజల పక్షాన సమస్యలపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.