PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి కార్యాలయంలో ఎన్​.టి.ఆర్​ కి ఘనంగా నివాళులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వై.ఎస్.ఆర్ హెల్త్ యూనివర్సిటీగా వై.ఎస్.ఆర్ ప్రభుత్వం పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన 20 నెలల తర్వాత అత్యధిక మెజారిటీ సీట్లతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలొనే ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడాన్ని స్వాగతిస్తూ ఈ రోజు కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం కర్నూలు నందు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, నగర పార్టీ అధ్యక్షులు నాగరాజు యాదవ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నంద్యాల నాగేంద్ర, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి యస్.కె.బషీర్,  పార్లమెంట్ యస్.సి సెల్ అధ్యక్షులు ధరూర్ జేంస్ మొదగలరు వారితో కలిసి ఎన్.టి.ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ హెల్త్ యూనివర్సిటి పేరు మార్పు వల్ల ఇప్పటి వరకూ చదువుకుని సర్టిఫికెట్లు పొందిన వారు ఇబ్బందులు పడతారని అనేక మంది ప్రభుత్వం ధృష్టికి తీసుకెళ్ళే ప్రయత్నం చేసినప్పటికి, వైసిపి ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించి ఎన్.టి.ఆర్ పేరును తొలగించిందని అన్నారు. జగన్ రెడ్డి ఒక్క అవకాసం ఇవ్వండని ప్రజలను వేడుకోవడంతో మంచి చేస్తారని ప్రజలు అధికారం ఇస్తే, మంచి కంటే చెడు ఎక్కువ చేసి ప్రతిపక్ష హొదా కూడా పార్టీకి రాలేని స్థితికి దిగజారిందని అన్నారు. తండ్రిపై ప్రేమ ఉంటే యూనివర్సిటి స్థాపించి తండ్రి పేరు పెట్టుకోవాలని, అంతే కాని ఉన్న పేరును తొలగించి తన తండ్రి పెరు పెట్టుకోవడం మంచిది కాదని అన్నారు.   విదేశాలకు వెళ్ళే వైద్య విద్యార్థులకు  కళాశాల పేరు మారడం వలన సాంకేతిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా టి.డి.పి ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరిస్తూ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా యూనివర్సిటీకి ఆయన పేరుతో పునర్ నామకరణం చేసిందని అన్నారు.ఈ కార్యక్రమంలొ పార్టీ నాయకులు బాల వెంకటేశ్వర రెడ్డి, ఆదాము, భాస్కర్ మొదలగు వారు పాల్గొన్నారు.

About Author