బాలల సంరక్షణ విషయంలో సిబ్బంది నిబద్దతతో పని చేయాలి
1 min readరాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు
డాక్టర్:జె రాజేంద్రప్రసాద్
యూనిట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం
జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్:సిహెచ్ సూర్య చక్రవేణి అధ్యక్షతన సమావేశం
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ : జె.రాజేంద్ర ప్రసాద్ జిల్లా బాలల సంరక్షణ యూనిట్ కార్యాలయము లో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా బాలల సంరక్షణ అధికారి డా. సి.హెచ్. సూర్య చక్రవేణి సమావేశానికి అధ్యక్షత వహించారు. జిల్లా బాలల సంరక్షణ కార్యాలయం ద్వారా ఇప్పటివరకు బాలల సంరక్షణ చేసిన కార్యక్రమాలు మరియు అందించబడుతున్న కార్యక్రమాలు అదేవిధంగా తీసుకున్న చర్యలు గురించి తెలియజేసినారు. ముఖ్య అతిథి గా పాల్గొన్న రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ : జె రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సిబ్బంది కూడా బాలల సంరక్షణ విషయంలో నిబద్ధతతో పనిచేస్తూ బాలలకు సత్వర న్యాయం అందించాల్సిన బాధ్యత అలాగే బాలల యొక్క సమస్యల పరిష్కారంలో అధికారులతో సమన్వయపరచుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేశారు. అదేవిధంగా సంరక్షణలో తీసుకోవాల్సిన చర్యల గురించి తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏలూరు జిల్లా బాలల సంరక్షణ కార్యాలయము రాష్ట్రస్థాయిలో ఆదరణ మరియు సంరక్షణ అవసరమున్న బాలలకు అందిస్తున్న విద్యా వసతి మరియు సంరక్షణ కల్పించడం పట్ల సంతృప్తిని వ్యక్తపరిచారు. దానితోపాటు బాలల సంరక్షణ విషయాల్లో తీసుకుంటున్న చర్యల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే తమ కమిషన్ దృష్టికి తీసుకుని వస్తే వాటి పరిష్కారం బాలల హక్కుల కమిషన్ ద్వారా పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ సమీక్ష సమావేశనందు డిస్టిక్ ప్రొబిషన్ ఆఫీసర్ మరియు చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నోడల్ ఆఫీసర్ అయినటువంటి జె .దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సమావేశం లో జిల్లా బాలల సంరక్షణ కార్యాలయం సిబ్బంది మరియు శిశు గృహ సిబ్బంది, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది పాల్గొన్నారు.