విద్యార్థులకు నీళ్ల సాంబార్.. ఎమ్మెల్యే సీరియస్
1 min read-విద్యార్థులతో ఎమ్మెల్యే ముఖాముఖి
-భోజనం బాగోలేదని విద్యార్థులు ఎమ్మెల్యేకు ఫిర్యాదులు
-డిఈఓ కు ఎమ్మెల్యే జయసూర్య ఫిర్యాదు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: బుధవారం మధ్యాహ్నం విద్యార్థులు భోజనం చేస్తున్న సరైన సమయంలో ఎమ్మెల్యే పాఠశాలలో భోజనం చేస్తున్న విద్యార్థుల దగ్గరికి వెళ్లారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే తనిఖీ అక్కడ వంటలను పరిశీలించగా అక్కడ అంతా నీళ్ల సాంబార్ భోజనం బాగోలేదు మెనూ పాటించడం లేదని పాఠశాల విద్యార్థులు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేసిన సంఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జరిగింది.వివరాల్లోకి వెళ్తే మధ్యాహ్నం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య పట్టణంలోని జూనియర్ కళాశాల పక్క నున్న గాంధీ మెమోరియల్ జిల్లా పరిషత్ పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ ఆకస్మిక తనిఖీలో ఆలుగడ్డ కర్రీ కాకుండా ఆలుగడ్డ నీళ్ల రసం ఉంది ఇలాగైతే పిల్లలు ఏ విధంగా తినాలి అంతే కాకుండా విద్యార్థుల దగ్గరికి ఎమ్మెల్యే వెళ్లి మీకు రోజు భోజనం బాగానే ఉందా కర్రీ సాంబార్ ఎలా ఉంది అని ఎమ్మెల్యే విద్యార్థులను అడగ్గా అన్నం ఉడికీ ఉడకని అన్నం నీళ్ల రసం పెడుతున్నారంటూ స్వయంగా విద్యార్థులే ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. విద్యార్థులతో పాటుగా నేలపైనే కూర్చుని ఎమ్మెల్యే భోజనం చేశారు.చాలామంది విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి క్యారెర్ తెచ్చుకొని భోజనం చేస్తుండగా మీరు ఎందుకు ఇక్కడే భోజనం చేయొచ్చు కదా అనే విద్యార్థులను ఎమ్మెల్యే ప్రశ్నించగా ఇక్కడ భోజనం బాగుండదని విద్యార్థులు ఎమ్మెల్యేకు చెప్పడంతో ఎమ్మెల్యే వంట ఏజెన్సీ మరియు పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వంట ఏజెన్సీ ని రద్దు చేయాలని అన్నారు.ఈ విషయంపై డీఈఓ కు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ టి సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, టిడిపి నాయకులు కృష్ణారెడ్డి,మల్లికార్జున రెడ్డి,తాటిపాటి అయ్యన్న, ముర్తుజావలి,ఎస్సీ సెల్ అధ్యక్షులు రాజన్న తదితరులు పాల్గొన్నారు.