మైనర్ విద్యార్థిని ని ఎత్తుకెళ్లిన కీచక ఉపాధ్యాయుడు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : విద్యా బుద్ధులు నేర్పాల్సిన కన్న తండ్రి లాంటి ఉపాధ్యాయుడు మాయమాటలు చెప్పి 13 సంవత్సరాల మైనర్ విద్యార్థిని ఎత్తుకెళ్లిన కీచక ఉపాధ్యాయుని వికృత ఘటన పత్తికొండ పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పత్తికొండ పట్టణంలో ఉపాధ్యాయ ముసుగులో 40 సంవత్సరాల వయసున్న రాఘవేంద్ర అనే కీచక ఉపాధ్యాయుడు కంప్యూటర్ క్లాసులు చెప్తానని ఒక మైనర్ విద్యార్థినీని రోజు ఇంటికి పిలిపించుకుని మాయమాటలతో అభం శుభం తెలియని 13 సంవత్సరాల బాలికను లొంగ తీసుకొని ఎత్తుకెళ్లిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల భార్య ఇతని వికృత చేష్టలకు విసుగు చెంది స్థానిక పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేసి పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయింది. విద్యార్థిని స్థానిక చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సమయంలో అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇటీవల పాఠశాల యాజమాన్యం ఇతని ప్రవర్తనను చూసి పాఠశాల నుండి బయటకు పంపినట్లు సమాచారం. అలాగే విద్యార్థినికి కూడా తీసి ఇచ్చి బయటకు పంపినట్లు తెలిసింది. నిందితుడు మైనర్ బాలిక తండ్రి కి మిత్రుడిగా చలామణి కావడం విశేషం. మిత్రుడు తన కూతురుకి మంచిగా విద్యార్థులు నేర్పుతాడని నమ్మకంతో తన కూతురిని రోజు నిందితుని ఇంటి వద్దనే వదిలేసి వచ్చేవాడని సమాచారం. ఇంత నమ్మకద్రోహం చేస్తాడని కలలో కూడా ఊహించలేదని బాలిక తల్లిదండ్రులు వాపోయారు. ఇలాంటి నయవంచక ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. తమ కూతురిని మాయమాటలు చెప్పి నమ్మించి ఎత్తుకెళ్లిన నయవంచకున్ని తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ తల్లిదండ్రులు స్థానిక పోలీసులు కోరారు.