ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వాటిని తొలగించండి
1 min readప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారి చిట్టా విప్పుతాం:ఎమ్మెల్యే
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పట్టణంలో ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న స్థలాలను రద్దు చేస్తామని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. బుధవారం మధ్యాహ్నం నందికొట్కూరు పట్టణంలోని శివశంకర్ థియేటర్ దగ్గర పాండురంగ స్వామి దేవాలయం పక్కన మున్సిపాలిటీ స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని మున్సిపాలిటీ స్థలంలో వేసిన రేకుల షెడ్లను తొలగించాలని మున్సిపాలిటీ కమిషనర్ సుధాకర్ రెడ్డిని ఎమ్మెల్యే ఆదేశించారు.పేదలకు మేము తప్పకుండా న్యాయం చేస్తామని గత ప్రభుత్వ హయాంలో 2019 నుండి 2024 వరకు పట్టణంలో ఎవరెవరు ఎక్కడెక్కడ స్థలాలు కబ్జా చేశారో వాటి చిట్టా తీయాలని ఎమ్మెల్యే కమిషనర్ కు చెప్పారు.టౌన్ ప్లానింగ్ అధికారులు ఇల్లీగల్ గా స్థలాలను ఇచ్చారని వాటన్నింటిని రద్దు చేస్తామని మున్సిపాలిటీలో ఒక అధికారి రెండు లక్షలు తీసుకొని స్థలాలను ఇచ్చారని ఇలా చేసిన అధికారుల పైనా కూడా చరణు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల పైన సమీక్షిస్తాం స్థలాలు వేరే వారికి ఇచ్చినట్లయితే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి మల్లికార్జున రెడ్డి ము ర్తు జావలి అయ్యన్న రాజన్న తదితరులు పాల్గొన్నారు.