మాదక ద్రవ్యాల వాడకంతో.. మానసిక రుగ్మతలు..
1 min readఅనారోగ్య సమస్యలు తలెత్తుతాయి..
- ఆర్థికంగా నష్టం… కుటుంబం వీధిన పడే అవకాశం
- మానసిక సైకియాట్రిక్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మానస హాస్పిటల్ అధినేత డా. రమేష్ బాబు
- అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
కర్నూలు, పల్లెవెలుగు: మత్తు పదార్థాల వినియోగంతో మానసిక, శారీరక రుగ్మతలు తలెత్తుతాయని, యువతకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు మానసిక సైకియాట్రిక్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మానస హాస్పిటల్ అధినేత డా. రమేష్ బాబు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం ఆయన కర్నూలు రేడియో ఎఫ్ఎంలో మత్తు పదార్థాల వాడకంతో జరిగే నష్టాన్ని వివరించారు. ముంబాయి, బెంగుళూరు, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలలోని పబ్బులలో స్నేహితుల ప్రోద్బలంతో గంజాయి, ఓపియం (హిరాయిను, పిథిడిన్), కొకైన్,హాలుసునేసన్స్ (మెస్కలిన్, కిటమిన్, యల్.యస్.డి. ,యమ్.డి.యమ్.ఎ.), బార్బిచురేట్స్,ఆంఫిటమిన్స్, ఇన్హలెన్సు తీసుకుంటున్నారని, కానీ వాటి వల్ల కొంత ఆనందం పొందగా… ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. దేశములో దాదాపుగా 2 కోట్ల మంది గంజాయి, 1 కోటి మంది ఓపియం,10 లక్షల మంది కొకైను తీసుకుంటున్నట్లు గణాంకాలలో తేలిందన్నారు.
ఆర్థిక నష్టం… కుటుంబం వీధిపాలు…
మాదక ద్రవ్యాలకు బానిసైన వారు ఆర్థికంగా నష్టపోవడమేకాక.. ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారని పేర్కొన్న డా. రమేష్ బాబు… కుటుంబంవీధినపాలు కావడం ఖాయమని స్పష్టం చేశారు. మద్యపానం, ధూమపానం తీసుకోవడం వల్ల శారీరక రుగ్మతలైన ఊపిరితిత్తుల సమస్యలు, హ్రుద్యోగ సమస్యలు, సెరిబ్రల్ స్ట్రోక్సు (పక్షవాతము), ప్రాణాంతకమైన సెప్టిసీమియ,విపరీతమైన నిస్సత్తువ, ఫిట్సు ( అపస్మారక స్థితి- వాయి), శరీర ప్రకంపణలు, చదువు మరియు పనిలో ఏకాగ్రత లోపించుట, మతిమరుపు, అసాంఘిక కార్యకలాపాలను (ఈ మాదకద్రవ్యాలను సంపాదించుకొరకు) చేయడానికి వెనకాడరన్నారు. అదేవిధంగా మానసిక రుగ్మతలు అనగా డుప్రెషను ( వ్యాకులత, నిరాశ, నుస్ప్రహ,ఆత్మహత్య ప్రయత్నము),పారనాఇడ్ ప్సైకోసిస్ ( అయిన వారిపట్ల అనుమాన భూతముతో వారిపై దాడి చేయుట), హాలుసినోసిస్ (ఎవరికీ వినిపించని వింత శబ్దాలను వినగలిగి వాటి ప్రకారముగా నడుచుకొనుట) మొదలగు అనేకమైన రుగ్మతల బారిన ఈ మాదకద్రవ్య బానిసలుగా మారడం ఖాయమని ఈ సందర్భంగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా. రమేష్ బాబు రేడియో ఎఫ్ఎం ద్వారా ప్రజలకు, యువతకు వెల్లడించారు.