ప్రభుత్వ కార్యాలయమా..గెస్ట్ హౌసా..
1 min readరిజిస్టర్ లో సంతకాలు లేని వైనం..-ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ ఆగ్రహం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఇది ప్రభుత్వ కార్యాలయమా లేక..మీకు గెస్ట్ హౌసా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య..శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పట్టణంలోని జల వనరుల(ఇరిగేషన్)శాఖ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీకి వెళ్లిన సమయంలో అక్కడ కార్యాలయంలో ఎవరూ లేరు. రిజిస్టర్ను ఎమ్మెల్యే తనిఖీ చేయగా రిజిస్టర్ లో ఈనెల 21 నుండి సంతకాలు ఎవ్వరూ చేయలేదు.అక్కడ అటెండర్ ఈశ్వర్ రెడ్డి మాత్రమే ఉన్నారు.ఇరిగేషన్ ఏఈ లేకపోవడంతో ఎమ్మెల్యే ఆయనకు ఫోన్ చేశారు.నేను కర్నూల్ లో మీటింగ్ లో ఉన్నానని ఆయన సమాధానం ఇచ్చారు.అంతే కాకుండా ప్రభుత్వ కార్యాలయం అయితే కార్యాలయానికి జల వనరుల శాఖ అని బోర్డు ఉండాలి బోర్డు లేకపోవడం మరియు రిజిస్టర్ లో సంతకాలు లేకపోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు.ఏ ప్రభుత్వ కార్యాలయం అనేది ప్రజలకు తెలియాలి కదా కార్యాలయానికి బోర్డు పెట్టాలని మీకు తెలియదా ఎందుకు బోర్డు పెట్టలేదు.. సంతకాలు ఎందుకు చేయలేదు..అంటూ ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు రోజుల్లోపు కార్యాలయానికి బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రబ్బాని కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్ పలుచాని మహేశ్వర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి ముర్తుజావలి తాటిపాటి అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.