మంత్రి టీజీ భరత్‌ను కలిసిన ‘ఐఎంఏ’
1 min read‘ నేషనల్ డాక్టర్స్ డే ’కు ప్రత్యేక అతిథిగా విచ్చేయాలని విన్నవించిన సభ్యులు
కర్నూలు, పల్లెవెలుగు:రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ను శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కర్నూలు జిల్లా అధ్యక్షుడు డా. రామచంద్రయ్య నాయుడు, జనరల్ సెక్రటరి డా. ఎస్వి. రామ్మోహన్ రెడ్డి, ఈసీ మెంబరు, మానస హాస్పిటల్ అధినేత డా. రమేష్ బాబు నగరంలోని మౌర్య ఇన్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ నెల 30న ఆదివారం ’ నేషనల్ డాక్టర్స్ డే ’ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఐఎంఏ భవన్లో జరిగే కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేయాలని కోరారు. అంతేకాక ఐఎంఏ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఇందుకు స్పందించిన మంత్రి టీజీ భరత్ కర్నూలు మెడికల్ హబ్ గా పేరుగాంచిందని, అందుకు తగ్గట్టుగానే వైద్యరంగంలో అభివృద్ధి చేయడంతోపాటు ఐఎంఏ భవన్ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఐఎంఏ అధ్యక్షుడు డా. రామచంద్రయ్య నాయుడు, జనరల్ సెక్రటరి డా. ఎస్వి. రామ్మోహన్ రెడ్డి, ఈసీ మెంబరు డా. రమేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో విశ్వభారతి మెడికల్ కాలేజి ఈఎన్టీ ప్రొఫెసర్ డా. మహేంద్ర కుమార్, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ మరియు హెచ్ఓడి డా. మంజుల బాయి, ప్రొఫెసర్ ఆఫ్ సర్జరి డిపార్ట్మెంట్ కేఎంసీ డా. మాధవి శ్యామల, నేషనల్ ఐఎంఏ రిప్రెసెంటెటివ్ , ఆర్.ఆర్. హాస్పిటల్ డైరెక్టర్ డా. బాలమద్దయ్య, కర్నూలు మాజీ డీఎం అండ్ హెచ్ఓ డా. శివ శంకర్ రెడ్డి, నెఫ్రాలజి వైద్యులు, ఈసీమెంబరు డా. సాయివాణి, గైనకాలజీ రిటైర్డు వైద్యులు డా. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.