PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విజయంతో తిరిగి రండి…

1 min read

క్రీడాకారులను ప్రోత్సహించిన డా. త్రినాథ్​

  • 29,30న రాష్ట్ర స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలు

కర్నూలు, పల్లెవెలుగు:రాష్ట్ర స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలు ఈ నెల 29,30వ తేదీలలో కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో జరగనున్నాయి. ఈ పోటీలో త్రినాథ్​ కిక్​ బాక్సింగ్​ అకాడమీ నుంచి 12 మంది క్రీడాకారులు వివిధ కేటగిరిలో పాల్గొననున్నారు. శుక్రవారం అమ్మా, ఆర్క్​ హాస్పిటల్స్​ అధినేత , త్రినాథ్​ కిక్​ బాక్సింగ్​ అకాడమీ చైర్మన్​ డా. త్రినాథ్​ ను క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. త్రినాథ్​ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడం అందరూ బాధ్యతగా భావించాలన్నారు. రాష్ట్ర స్థాయి కిక్​ బాక్సింగ్​ పోటీలో పాల్గొనే క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అనంతరం వారిని అభినందించారు. ఇక్కడ గెలుపొందిన  వారు  జూలై 24 నుంచి 28వ తేదీ వరకు గోవాలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని త్రినాథ్​ కిక్​ బాక్సింగ్​ అకాడమీ కోచ్​, కిక్​ బాక్సింగ్​ రాష్ట్ర స్థాయి కోశాధికారి నరేంద్ర తెలిపారు.

About Author