నామినేటెడ్ పదవుల్లో కురువలకు ప్రాధాన్యత ఇవ్వాలి
1 min readకర్నూలు జిల్లా కురువ సంఘము
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లాలో కురువలు అత్యధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేకపోవడంతో చాలా ఏళ్లుగా వెనుకబడి ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఎంపీ సీటు కేటాయించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు బహుమతిగా గెలిపించినట్లు జిల్లా గౌరవ అధ్యక్షులు కిష్టన్న తెలిపారు .శనివారం కర్నూలు నగరంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి .జి .భరత్ ను జిల్లా కురువ సంఘము నాయకులు శాలువా కప్పి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం .కే .రంగస్వామి ,జిల్లా కోశాధికారి కే .సి నాగన్న జిల్లా ఉపాధ్యక్షులు బి . వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయులు .జిల్లా ప్రదాన కార్యదర్శి ఎం .కే . రంగస్వామి మాట్లాడుతూ జిల్లాలో ఐదు లక్షల ఓటర్లు ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా రాజకీయాలకు అంటరాని వారిగా ఉంచిన పార్టీలు ఎన్నికల్లో ఎంపీ స్థానాన్ని బస్తిపాడు నాగరాజుకు కేటాయించినందుకు గెలిపించి చంద్రబాబుకు కురువ కులస్థులు బహుమతిగా ఇచ్చామని ఆయన అన్నారు. తేలుగుదేశం పార్టీలో కష్టపడిన కురువ కులస్తులకు నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడుని ,నారా లోకేష్ని, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ని మరియు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు కురువ కులస్తుల తరఫున . మా కురువల మీద తెలుగుదేశం పార్టీ ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని అన్నారు. నమ్మకానికి మారుపేరైన కురువలకు నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలో కూడా కురువ కులస్థులను దృష్టిలో ఉంచుకుని అన్ని నియోజకవర్గాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాము . ఈ కార్యక్రమం లో జిల్లా కురువ మహిళా సంఘము అధ్యక్ష ,కార్యదర్శి టి .శ్రీలీల,కురువ అనితమ్మ , జిల్లా నాయకులు కే దేవేంద్ర,బి .సి . తిరుపాల్, పుల్లన్న, నాగయ్య ,హరిదాసు, నాగశేషులు, తదితరులు పాల్గొన్నారు.