అక్రమ మద్యం, గంజాయి నియంత్రణపై పటిష్ఠమైన చర్యలు చేపట్టండి
1 min readజిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి
జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన సెబ్ అధికారులకు కలెక్టర్ హితవు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో నాటుసారా, గంజాయి నియంత్రణపై పూర్తిస్ధాయిలో నిఘావుంచి అటువంటి చర్యలకు పాల్పడే వారిని నియంత్రించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి సెబ్ అధికారులకు సూచించారు. శనివారం స్ధానిక కలెక్టరేట్ లో సెబ్ జాయింట్ డైరెక్టర్ యన్. సూర్యచంద్రరావు, వారి సిబ్బంది, జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్విని మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ నాటుసారా, అక్రమ మద్యం, గంజాయి సరఫరా, వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని విస్త్రృతంగా ప్రచారం చేసి అటువంటి చర్యలకు పాల్పడే వారిని నియంత్రించాలని సూచించారు.