మైనారిటీ విద్యార్థుల హాస్టల్ కర్నూల్లో ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటాం..
1 min readమంత్రి టి.జి భరత్
సమగ్రశిక్షా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరానికి దూరంగా ఉన్న మైనారిటీ విద్యార్థుల వసతిగృహాన్ని కర్నూలు నగరంలో ఏర్పాటుచేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన సమగ్ర శిక్షా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరంలో ఉన్న పాఠశాలల నిర్వహణ, విద్యార్థుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2014-2019 మధ్య విద్యార్థుల హాజరు, పాఠశాలల నిర్వహణతో పాటు గడిచిన ఐదేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని చెప్పారు. ప్రధానంగా పదేళ్లకు పైబడిన పాఠశాలల బిల్డింగుల సామర్థ్యాన్ని వెంటనే పరిశీలించి రిపోర్ట్ తయారుచేయాలన్నారు. పాఠశాలల గోడలు ఏ మాత్రం ప్రమాదంగా ఉన్నా వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీచేశారు. తమ ప్రభుత్వంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.