ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎంపీకి వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అన్ని విధాలుగా వెనుకబడిన ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి పరచాలని మాదాసి మదారి కురువ సంఘం నియోజకవర్గ కార్యదర్శి పెద్దహ్యాట మల్లయ్య, మండల అధ్యక్షుడు పంపాపతి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం దేశ రాజధాని ఢిల్లీ ఎంపీ గెస్ట్ హౌస్ నందు కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజును కలిసి ఆలూరు నియోజకవర్గ అభివృద్ధిపై వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంత రైతుల జీవనాడి అయినటువంటి వేదవతి ప్రాజెక్టు, నగరడోన రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ, జింకల్ పార్కు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తగిన వనరులు ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా మండలంలో నిర్మాణం చేపట్టుకొని ప్రధాన రహదారుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాదిలింగప్ప, చాగప్ప, హొళగుంద మండలం ఆర్యా వైశ్య సంగం నాయకులు నవీన్, సింగం సుదర్శన్ శెట్టి, వెంకటేష్, సమ్మతగేరి కేశప్ప, లోకేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.