వైద్య వృత్తి మనుషులకు పునర్జన్మ నిచ్చే మహాశక్తి
1 min readలయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కరోనా లాంటి ప్రాణాంతకమైన వ్యాధి ప్రబలిన సమయంలో కూడా వైద్యులు తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా వైద్య సహకారాన్ని అందించారని ప్రముఖ కంటి వైద్య నిపుణులు లయన్ డాక్టర్ జయప్రకాష్ అన్నారు. వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త బస్టాండ్ సమీపంలోని ఆద్య వైద్యశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో జరిగిన వైద్యుల సన్మాన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఆర్. ప్రణీత్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష, ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్, ప్రముఖ చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ వి. రమేష్ ,డాక్టర్ అపర్ణ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ఆర్. ప్రణీత్ మాట్లాడుతూ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు .లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ ప్రత్యూష మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సహకారంతో త్వరలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నామన్నారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు లయన్ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ పసిపిల్లల్లో వారి అనారోగ్యాన్ని గమనించి నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు వైద్యులను వెంటనే సంపాదించాలన్నారు. లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడంలో తన వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా అధికారి లయన్ పి. వెంకటేశ్వర్లు ,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ మాజీ అధ్యక్షురాలు లయన్ రాయపాటి నాగలక్ష్మి ,లయన్ ఎస్ .వి అనూష ,ఉపాధ్యక్షులు లయన్ పవన్ కుమార్, డాక్టర్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేకును కట్ చేసి అందరి వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.