PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు

1 min read

జిల్లా పరిషత్ హై స్కూల్ లో  ఉర్దూ కన్నడ మీడియంలో ప్రవేశాలు కల్పించాలి

విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్

పల్లెవెలుగు వెబ్  హొళగుంద:  ఒకటి నుంచి 5వ తరగతి వరకు  తమ మాతృభాషలో  విద్యాభ్యాసం చేసిన  విద్యార్థులకు కన్నడ ఉర్దూ మీడియంలలో  అడ్మిషన్లను నిరాకరించి వారి జీవితాలతో ఆడుకోవద్దు అని  విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు నాయకులు  డిమాండ్ చేశారు. సోమవారం హోల గుందలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీబీఎస్సీ  లో ఉందని ఆరవ తరగతిలో కన్నడ ఉర్దూ మీడియం లలో ప్రవేశాలు లేవని కేవలం ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే  విద్యార్థులను చేర్చుకుంటామని  తెలియజేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు  ఆందోళన వ్యక్తం చేశారు.  ఇదే విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజీర్ ను కలవగా  పాఠశాల సీబీఎస్ఈ లో చేరినందున  ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంగ్లీష్ లో మాత్రమే ప్రవేశాలు కల్పిస్తామని  తెలియశారు. విద్యార్థుల అనుమతి లేకుండా తల్లిదండ్రులకు సమాచారం లేకుండా  పాఠశాలలో విద్యార్థుల యొక్క తరగతి మీడియంలు మార్చడమే కాకుండా ఇప్పుడు మీడియం లేదని ప్రవేశాలను నిరాకరించడం  చాలా దారుణమని విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఒకటో తరగతి నుండి 5వ తరగతి వరకు చదివిన విద్యార్థులు  ఇంగ్లీష్ మీడియం లో ఎలా చదవగలరని  సుమారు 600 మంది విద్యార్థులు ఉర్దూ కన్నడ మాధ్యమంలో సరైన ఉపాధ్యాయులు లేక విద్యాబోధన లేక బలవంతంగా సీబీఎస్ఈ సిలబస్ చేరారని, చదువులు రాక  విద్యార్థులు పాఠశాలను మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని  విచారం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు  కన్నడ ఉర్దూ మీడియంలలో ప్రవేశాలను నిరాకరిస్తే వారిని పాఠశాలకు మాన్పించడమే తప్ప తాము చేయగలిగింది ఏమీ లేదని  వారు వాపోయారు. దాదాపుగా 1800 మంది విద్యార్థుతో కన్నడ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియంలు కలిగిన ఏకైక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అని  అయితే అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల విద్యార్థుల సమ్మతి తీసుకోక  తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వక విద్యార్థులకు తెలియకుండానే బలవంతంగా గత సంవత్సరం సీబీఎస్ఈ ఇంగ్లీష్ మీడియం లోకి మార్చారని  అప్పుడు అడిగితే పాఠశాల బై ఫర్ కేషన్ జరుగుతుందని  కన్నడ ఉర్దూ మీడియంలు వస్తాయని చెప్పారని అయితే ఈ సంవత్సరము ఏమో ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే ప్రవేశాలు అని చెబుతున్నారని విమర్శించారు. ఆదోని డివిజన్లో  కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలో కన్నడ మీడియంలో ప్రవేశాలు జరుగుతున్నాయని  విద్యార్థులు కన్నడ మేడం లో చదువుతున్నారని కేవలం హొళగుంద విద్యార్థులకు మాత్రమే ఈ దుస్థితి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల యొక్క ఈ పరిస్థితిపై నాయకులు అధికారులు దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తు పాడైపోకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.  ఈ కార్యక్రమంలో ఎంపీపీ తనయుడు ఈసా, మైనారిటీ నాయకులు హమీద్ సుభాన్  తదితరులు పాల్గొన్నారు.

About Author