PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశ చరిత్రలో పింఛన్ కార్యక్రమం నిలిచిపోతుంది: ఎమ్మెల్యే కోట్ల

1 min read

పల్లెవెలుగు వెబ్  ప్యాపిలీ: దేశ చరిత్రలో పింఛన్ కార్యక్రమం నిలిచిపోతుందని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి,తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై. నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈసందర్భంగా సోమవారం డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలో పెద్దలు, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి , వై నాగేశ్వరరావు యాదవ్  తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్యాపిలీ మండలంలోని బురుగల,కవులపల్లె,సీతమ్మ తాండ, రాచర్ల, నేరేడుచర్ల గ్రామాలలో పింఛన్ పంపిణీ చేపట్టారు.ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ:తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఆదేశానుసారం మేనిఫెస్టోలో భాగంగా వాగ్దానం చేసిన దానిని దాన్ని నెరవేర్చడానికి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 65 లక్షల పేదవాళ్లకు నాలుగు వేల కోట్ల చిల్లర ఒకేసారి ఒకే టైంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు తో ఆఫీసర్స్,ఎమ్మెల్యేలతో,మినిస్టర్స్ తో అన్ని గ్రామాలలో పింఛన్ కంపెనీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగినది.దాంట్లో భాగంగానే  డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి  గ్రామాలలో పింఛన్ పంపిణీ చేయడం జరిగినది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, అనుకున్న టైంలో, ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి గడిచిన నెలల పింఛన్ ని ఈరోజు పేద ప్రజలకు ఇవ్వటంలో భారత దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది న్నారు.ఈకార్యక్రమంలో తెదేపా, భాజపా, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author