PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా జాతీయ వైద్యుల దినోత్సవం

1 min read

మెడికల్​ కళాశాలలోని కార్డియాలజి విభాగంలో కేక్​ కట్​ చేసిన ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​

  • భారత రత్న బి.సి. రాయ్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైద్యులు

కర్నూలు, పల్లెవెలుగు:

కర్నూలు మెడికల్​ కళాశాలలోని కార్డియాలజి విభాగంలో సోమవారం జాతీయ వైద్యుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. కార్డియాలజి ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ నేతృత్వంలో వైద్యులు కేక్​ కట్​ చేసి వైద్యసిబ్బందికి పంచారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ మాట్లాడుతూ వైద్యుడిగా, స్వాతంత్ర్య సమరయోధుడిగా, విద్యావేత్తగా మరియు రాజకీయవేత్తగా సేవలందించి… భారత రత్న అవార్డు పొందిన డా. బిధాన్​ చంద్ర రాయ్​ జయంతిని పురస్కరించుకుని జూలై 1వ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. పశ్చిమ బెంగాల్​ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా  ఉన్న సమయంలోనూ.. ప్రతి రోజు రెండు గంటలు పేదలకు వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.  భారత రత్న డా.బిధాన్​ చంద్ర రాయ్​ జన్మదినం జూలై 1, 1882 కాగా జూలై 1,1962న మరణించారని, అందుకే జూలై 1న  ఆయన స్మారకార్థం జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటామన్నారు. రోగులకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులదేనని, అందుకే వైద్యులను దేవుళ్లతో పోల్చుతారని ఈ సందర్భంగా కార్డియాలజి ప్రొఫెసర్​ డా. చంద్రశేఖర్​ వెల్లడించారు. అనంతరం బి.సి. రాయ్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఆ తరువాత మెడికల్​ కళాశాల ప్రిన్సిపల్​ డా. చిట్టెమ్మ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపి.. ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డా. కిరణ్​, డా.లలిత, డా. ప్రశాంత్​ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author