నాన్ ఎసి స్టార్ స్లీపర్ కోచ్ ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే
1 min readమధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది
ప్రతిరోజు రాత్రి 10:30గంటల నిమిషాల నుండి బిహెచ్ఎల్ లకు ప్రయాణికులకు అందుబాటులో
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు డిపో నుండి ప్రజల సౌకర్యార్థం నాన్ ఏసీ స్టార్ లైనర్ స్లీపర్ కోచ్ బస్సు ని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య(చంటి) చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఏలూరు డిపో రాష్ట్రంలో గుర్తించబడినటువంటి డిపో అని నిత్యం వందలాది బస్సులు ఏలూరు మీదుగా వెళ్లడం జరుగుతుందని ప్రజల సౌకర్యం కోసం మధ్యతరగతి ప్రయాణికులు కూడా ఆనందంగా ప్రయాణించే విధంగా ఈ నాన్ ఏసి స్లీపర్ కు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలియచేశారు. ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి NVR వర ప్రసాద్ మాట్లాడుతూ ఈ బస్సులు ప్రతి రోజు రాత్రి 10.30 ని.బయలుదేరి ఏలూరు నుండి బీహెచ్ఈఎల్ చేరుకుంటాయని,తిరిగి బీహెచ్ఈఎల్ నుండి రాత్రి 9.30 ని బయలుదేరి ఏలూరు చేరుకుంటాయని టికెట్ ధర రు.890 గా రూపాయలుగా నిర్ణయించడం అయిందని తెలియజేశారు.స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ ప్రైవేటు బస్సులు కంటే ఆర్టీసీ బస్సులు క్షేమదాయకమని ప్రతి ఒక్కరు ఆర్టీసీ ఆదరించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ బి. వాణి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ జి .మురళి,పి ఆర్ ఓ నరసింహం, అసిస్టెంట్ మెకానిక్ ఇంజనీర్ ప్రేమ్ కుమార్,కార్మికులు పాల్గొన్నరని ఒక ప్రకటనలో తెలిపారు.