ఖైదీలకు నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమం
1 min readకారాగార సూపర్డెంట్ సిహెచ్ ఆర్ వి స్వామి ఆధ్వర్యంలో కార్యక్రమం
అవగాహన కల్పించిన సీనియర్ న్యాయవాది కూన కృష్ణారావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా కారాగారం సూపరింటెండెంట్ సీహెచ్.ఆర్.వి. స్వామి ఆధ్వర్యంలో నూతన చట్టాలపై ఖైదీలకు అవగాహన కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది & ట్రైనర్ కూన కృష్ణారావు మాట్లడుతూ భారతీయ న్యాయ సంహిత,భారతీయ నాగరిక సురక్ష సంహిత,భారతీయ సాక్ష్య అధినీయం చట్టాలపై నియమావళి, అమలు, ఖైదీలకు కలిగే ప్రయోజనాలు,సంస్కరణలు, సమస్యలపై అవగాహన కలిగించారు.జీరో ఎఫ్.ఐ.ఆర్., ఎలక్ట్రానిక్ ఎఫ్.ఐ.ఆర్.,ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ సాక్ష్యాల వీడియో రికార్డింగ్ వగైరాలు ఈ నూతన నేర చట్టాలు అవకాశం కల్పించింది.చట్టబద్ధత గుర్తించింది.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిట్ న్యాయవాది తాళ్లూరి మధు, లయన్స్ జిల్లా నాయకులు ఎల్. వెంకటేశ్వరావు,జిల్లా జైలర్స్ కె. వెంకటరెడ్డి,కె.శ్రీనివాసరావు, డిప్యూటీ జైలర్స్ కె. సత్యనారాయణ,ఎం.కిషోర్ కుమార్ తదితరులు మాట్లాడారు.