నిబద్ధతతో విధులు నిర్వహించండి- ఎమ్మెల్యే పార్థసారథి
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్లానింగ్ సెక్రటరీలు ప్రలోభాలకు గురికాకుండా నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు కమిషనర్ రామచంద్ర రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని నిర్మాణం చేయడానికి కలిసికట్టుగా ప్లానింగ్ సెక్రటరీ విధులు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అక్రమ కట్టడాల విషయంలో ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు పోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ నాయక్, వివిధ సచివాలయం ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు.