PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గర్భిణీల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యురాలుపై చర్యలు తీసుకోవాలి

1 min read

పి.డి.ఎస్.యు,ఏఐఎస్ఎఫ్, ఎస్ ఎఫ్ ఐ, ఎన్.ఎస్.యు.ఐ,పిడిఎస్ఓ, ఏఐవైఎఫ్ డిమాండ్

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ప్రభుత్వ వైద్యశాలలో సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రి సోమప్ప సర్కిల్ నందు ప్రైవేటు క్లీనిక్ ఏర్పాటు చేసుకొని గర్భిణీల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యురాలుపై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని పి. డి. ఎస్. యూ జిల్లా కార్యదర్శి  మహేంద్ర బాబు,ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజయేంద్ర,ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి విజయ్, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రాజీవ్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు  జిల్లా (డి.సి.హెచ్.ఎస్) డాక్టర్ ఆర్. మాధవి కి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వైద్యులు రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ.. ఎమ్మిగనూరు  ప్రభుత్వ వైద్యశాలలో వైద్యురాలు మాత్రం జిల్లా అధికారులు మాటలు లెక్క చేయకుండా ప్రైవేటు క్లీనిక్ కు ప్రాధాన్యం ఇస్తూ పేద గర్భిణీల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఇప్పటికే ఈ వైద్యురాలు నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది పసి పిల్లలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆశా వర్కర్ల కు కమీషన్లు ఆశ చూపించి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే గర్భిణీలను తన ప్రైవేటు క్లీనిక్ కు తీసుకెళ్లి స్కానింగ్, రక్త పరీక్షలు పేరుతో వేలాది రూపాయలు దోపిడీ చేస్తుంది. ఇప్పటికైనా అధికారులు అధికారులు స్పందించి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు రామకృష్ణ నాయుడు, సురేంద్రబాబు, కృష్ణ,సురేష్,ఖాజా తదితరులు పాల్గొన్నారు.

About Author