PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండలంలోని అన్ని పాఠశాలల్లో త్రాగునీటి సమస్య ఉండకూడదు

1 min read

పాఠశాలల ఆవరణలలో పరిశుభ్రంగా ఉంచాలి
డిప్యూటీ డి ఈ ఓ రాజగోపాల్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు :  మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య ఉండకూడదని డిప్యూటీ డి ఈ ఓ రాజగోపాల్ రెడ్డి అన్నారు, మంగళవారం స్థానిక మండల విద్యాశాఖ అధికారి నందు మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా డిప్యూటీ డిఇఓ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఎన్ని పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్ లు ఉన్నాయి, అలాగే ఏ ఏ పాఠశాలలో (ట్యాప్ వాటర్) త్రాగునీటి గల పాఠశాలలు ఉన్నాయి, వాటి పర్యవేక్షణ, ఇబ్బందుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు, అలాగే విద్యార్థులకు త్రాగునీటి సమస్య లేకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉందని ఆయన తెలిపారు, ఓవర్ హెడ్ ట్యాంకులు గల పాఠశాలలో  నెలలో ప్రతి మొదటి, నాలుగవ వారం ఆయా ట్యాంకులను శుభ్రపరచాలని ఉపాధ్యాయులకు సూచించారు, అలాగే విద్యార్థులకు ఆరోగ్యం శుభ్రత గురించి తెలియజేయాలని, విద్యార్థులందరూ విధిగా మధ్యాహ్నం భోజనం చేసే ముందు ప్రతి ఒక్క విద్యార్థి చేతులను శుభ్రపరుచుకొనే విధంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు, ముఖ్యంగా వర్షాకాలం అవడం వలన పాఠశాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు, పాఠశాల ఆవరణలలో వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలన్నారు, వంట చేయు ప్రదేశాలు శుభ్రంగా ఉండాలని, వంట చేయువారు శుభ్రత పాటించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన ప్రధానోపాధ్యాయులకు తెలియజేశారు, అలాగే జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించి అక్కడి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మనాభంకు పాఠశాల శుభ్రత పై తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గంగిరెడ్డి, మండల విద్యాశాఖ అధికారి-2 సునీత, మండలంలోని అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. 

About Author