టైలరింగ్ మహిళలకు స్వయం ఉపాధి:బిషప్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మహిళలు కొట్టు శిక్షణ ద్వారా తర్వాత వారికి స్వయం ఉపాధి లభిస్తుందని కర్నూలు మేత్రాసన కాపరి శ్రీ గోరంట్ల జ్వాన్నేస్ అన్నారు.మంగళవారం కర్నూలు మండల పరిధిలోని వెంకాయ్య పల్లె కేడిఎస్ఎస్ లో జరిగిన మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిషప్ మరియు సికింద్రాబాద్ సౌత్ ఇండియన్ బ్యాంక్ డిజిఎం శ్రీధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నూలు మేత్రాసన కాపరి మాట్లాడుతూ ఏపీ సాంఘిక సేవ సంస్థ మరియు సౌత్ ఇండియన్ బ్యాంక్ వారి సహకారంతో చేపడుతున్న కుటుంబ శిక్షణ కార్యక్రమాలు అభినందనీయమని ఈ కుటుంబ శిక్షణ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకొని మీ అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన అన్నారు.గ్రామీణ ప్రాంత మహిళలు ఎవరైనా సరే ఆసక్తి ఉన్నవారు కుట్టు శిక్షణకు హాజరుకావాలని కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ భాస్కర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్ఎస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ ఫాదర్ టిపి ప్రసాద్,క్లస్టర్ హెడ్ షహబాజ్,కర్నూలు బ్రాంచ్ మేనేజర్ సుధాకర్ కుమార్ మరియు శిక్షణ మహిళలు పాల్గొన్నారు.