ప్రతిభ చూపిన విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేసిన.. జిందాల్ సిమెంట్
1 min readపల్లెవెలుగు న్యూస్ గడివేముల: మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామ సమీపంలో ఉన్న జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రతి ఏడాది పదవ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ను అందించడం మంచి పరిణామం అని నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి కొనియాడారు. మంగళవారం మండల పరిధిలోని ప్రతిభావంతులైన 76 మందికి రూ. 14 లక్షలు స్కాలర్ షిప్స్ ను జిందాల్ యాజమాన్యం అందిస్తున్న కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా వివిధ పాఠశాలలో, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించి వారిలో ఉన్న ప్రతిభను ప్రోత్సహించడం జరుగుతుందని జిందాల్ యూనిట్ హెడ్ నవనీత్ చౌహన్ తెలిపారు. కార్యక్రమంలో గడివేముల ఎంఈఓ విమల వసుంధర దేవి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శైలజ, హెచ్ఎం విక్టర్ ఇమ్మానియేల్, కస్తూర్బా స్పెషల్ అధికారి, సి ఎస్ ఆర్ మేనేజర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.