4న విద్యా సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ : జులై 4వ తేదీన ఎస్.ఎఫ్.ఐ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కడవల రవి పిలుపునిచ్చారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశం ఏర్పరచడం జరిగింది . నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్, దేశ వ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సులు చదవాలనుకునే 24 లక్షల మంది విద్యార్థులు మే 5న ప్రవేశ పరీక్ష రాసారన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA ) నీట్ యూజీ- 2024 పరీక్ష నిర్వహణ సక్రమంగా నిర్వహించకపోవడం వలన విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారనీ తెలిపారు.మార్కుల్లో అవకతవకలు, విడుదల చేసిన ఫలితాలలో 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావడం, వారిలో ఎనిమిది మంది ఒకే కేంద్రం కావడం గమనార్హం అని అన్నారు. నీట్-24 ఫలితాలు రావడం చాలా విచిత్రంగా ఉందని అన్నారు. జూన్ 14న పరీక్ష ఫలితాలు విడుదల చేయాలి కానీ హఠాత్తుగా లోక్ సభ ఫలితాలు వెలువడిన రోజు జూన్ 4న ఫలితాలు విడుదల చేయడం పలు అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. యావత్ దేశo మొత్తం మీడియా దృష్టి అంతా లోక్సభ ఎన్నికల్లో ఉంటే NTA నిర్వహించిన నీట్ ఫలితాలు అక్రమాలు కప్పి పెట్టే ఉద్దేశంతోనే ఇలా చేసాసరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో లక్షలాదిమంది విద్యార్థులు, తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురయ్యారని అన్నారు. దేశవ్యాప్తంగా 4750 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు సజావుగా నిర్వహించినట్లు చెప్పడం కేవలం 6 కేంద్రాల్లో మాత్రమే సమస్య వచ్చిందని చెప్పడం చాలా దుర్మార్గమని అన్నారు.