కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన కర్నూలు ఎం.పి
1 min readకర్నూలు టూ బళ్లారి కి హైవే నిర్మించాలంటూ గడ్కరీని కోరిన ఎం.పి నాగరాజు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా అభివృద్దే ధ్యేయంగా కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ముందుకెళ్తున్నారు… పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్న నాగరాజు జిల్లా అభివృద్ధికి సహకరించాలంటూ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ అభ్యర్థిస్తున్నారు… బుధవారం ఢిల్లీలో కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరామ్ గడ్కరీని ఆయన కార్యాలయంలో కలిసిన ఎం.పి.. కర్నూలు టూ బళ్లారి కి హైవే రోడ్డు నిర్మించాలని, కర్నూలు టోల్ గేట్ నుండి పంచలింగాల గ్రామం వరకు సర్వీస్ రోడ్డు ను విస్తరణ చేయాలని, అలాగే వెంకటరమణ కాలనీ అండర్ పాస్ వద్ద ఉన్న సర్వీస్ రోడ్డును విస్తరణ చేపట్టాలని గడ్కరీ కి వినతిపత్రం సమర్పించారు.. దీని పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్న నాగరాజు.. కర్నూలు టూ బళ్లారి హైవే రోడ్డు ఏర్పాటు తో పాటు రోడ్ల విస్తరణకు హామీ ఇచ్చినట్లు తెలిపారు.