పదవి విరమణ పొందిన హోంగార్డ్ బాలస్వామికి ఘన సత్కారం
1 min readజంగారెడ్డిగూడెం సర్కిల్ ఆఫీసులో ఆత్మీయ వీడ్కోలు
34 సంవ:ల సర్వీస్ కాలంలో ఉత్తమ ఉద్యోగిగా పలువురు అధికారుల నుండి ప్రశంసలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి గౌరవ ప్రదంగా పదవీ విరమణ పొందడం అదృష్టమని జంగారెడ్డిగూడెం సర్కిల్ డిఎస్పి యు రవిచంద్ర అన్నారు. జంగారెడ్డిగూడెం పరిధిలో పని చేసిన సర్కిల్ ఆఫీస్ సిబ్బంది (హోంగార్డ్స్ మరి ఇతర సిబ్బంది)బాలు 170) గత 34 సంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఎనలేని సేవలు చేశారు. ఉన్నతాధికారుల మనల్ని అందుకొని తోటి సిబ్బంది తో స్నేహపూర్వకంగా కలిసిమెలిసి తన ఉద్యోగా ధర్మన్ని సమయస్ఫూర్తితో కొనసాగిసించడం అభినందనీయమన్నారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాల సిబ్బంది మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో బాలస్వామి దంపతులను ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమన్నారు. ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉన్న పోలీసు ఉద్యోగం సంపూర్ణంగా పూర్తి చేసి, పోలీస్ శాఖలో ఎక్కువ కాలం పనిచేసి సేవలు అందించడం అభినందనీయమని అదేవిధంగా కానిస్టేబుల్ తో సమానంగా హోంగార్డు రాత్రి అనక. పగలనక పనిచేస్తారని అయితే జీతభత్యాల విషయంలో వ్యత్యాసం ఉండటం బాధాకరమని అన్నారు. పదవి విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనకు తెలియజేయాలని సూచించారు. సిఐ రాజేష్ మాట్లాడుతూ డ్యూటీ విషయంలో బాలస్వామి నిబద్ధతతో పనిచేసేవారని, పెద్ద కుటుంబాన్ని చిన్న ఉద్యోగంతో నడుపుకు రావటం దైవ సంకల్పం అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ రైటర్ హెచ్ రెడ్డి, హెచ్ సి జె. భీమశంకర్, మంగయ్య, ఉమా, హెచ్ జి సి సి జి నరసింహారావు, పి ఎల్ సి సుజన్ కుమార్, టౌన్ స్టేషన్ సిబ్బంది. ట్రాఫిక్ సిబ్బంది. హోంగార్డ్స్ మరియు తదితర సిబ్బంది పాల్గొన్నారు.