PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చిగురుస్తున్న ఆశలు.. గౌరు దంపతుల చొరవ..

1 min read

వైకాపా ప్రభుత్వ హయాంలో మూలన పడ్డ రిజర్వాయర్

అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తులకు మోక్షం..

పల్లెవెలుగు వెబ్ గడివేముల : ఉమ్మడి కర్నూలు జిల్లాలో   అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు 1996 సంవత్సరం నుండి 2003 లోపు జపాన్ నిధులతో నిర్మించిన ఈ  రిజర్వాయర్ దాదాపు  పదిహేను కిలోమీటర్లు వైశాల్యంతో  నిర్మించారు. కేసీ కెనాల్  క్రింద సాగవుతున్న‌ 2.78 లక్షల ఎకరాల ఆయకట్టు తుంగభద్ర నదీ ప్రవాహం మీదనే ప్రధానంగా ఆధారపడి ఉన్నది.,3 టియంసిల సామర్థ్యమున్న అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు నాసిరకమైన పనులతో గతం లో ఒక సారి 50 మీటర్లల మేర కట్ట లోపల కోతకు గురైంది  యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు తీసుకున్నారు  మళ్లీ 100 మీటర్ల మేర లోపల కట్ట

. కుంగి పోయింది. దీంతో యుద్ధ ప్రతిపాదికను 20 లక్షల నిధులతో ఇసుక సంచులతో కుంగిన ప్రాంతాన్ని మరమ్మతులు చేశారు అయితే ఆళ్లగడ్డ లాకుల వద్దా 2019లో 200 మీటర్ల మేర కట్ట కుంగడంతో 2019 సంవత్సరం తాత్కాలిక మరమ్మతులు చేసి అర టీఎంసీ నీటి నింపారు రైతులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసి శాశ్వత మరమ్మత్తుల కోసం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో మూడు కోట్ల పైచిలుకు పని అంచనాతో ఈ సంవత్సరం రిజర్వాయర్లలో నీరు నిల్వ లేకుండా ఏర్పాటు చేసి సెప్టెంబర్ నుండి  పనులు మొదలుపెట్టారు అయితే గతంలో నీరు ఉండడంతో కట్ట కింది భాగంలో బరం జారుతూ దాదాపు అయిదు వందల మీటర్ల మేర లోతులో ప్రమాదకర స్థాయిలో కట్ట కుంగి పోవడంతో ప్రభుత్వం మారడంతో 2020లో అధికారులు నిపుణుల కమిటీని రప్పించి సలహా మేరకు పనులు చేయాలనే ఉద్దేశంతో  రిజర్వాయర్ను ఎక్స్పర్ట్ కమిటీ ప్యానల్ పరిశీలించింది కట్ట కింది భాగంలో ఉన్న నీరును పూర్తిస్థాయిలో తీసేసి బరం లెవెల్ పైనుండి పెంచుకుంటూ రావాలని నిపుణుల కమిటీ సూచించింది రిజర్వాయర్లలో నీరు నిల్వ ఉంచడం సాధ్యం కాదని తేల్చేశారు అప్పటి నుచి నేటి వరకు ఆయకట్టుకింద తలముడిపి రైతులు పంట వేయలేదు. కడప  పట్టణానికి దాహార్తి తీర్చే ప్రధాన వనరు రిజర్వాయర్లలో నీరు నిలపడం సాధ్యం కాదని నిపుణుల కమిటీ తేల్చడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది వైసిపి ప్రభుత్వ హయాంలో డిఆర్సి మీటింగ్లో అప్పటి ఎమ్మెల్యే ఆర్థర్. కాటసాని రాంభూపాల్ రెడ్డి రెండు మూడుసార్లు ఈ విషయంపై గళం విప్పిన సమస్య తీరలేదు టిడిపి పాణ్యం ఇన్చార్జి అప్పటి మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి రిజర్వాయర్ సందర్శించి వైకాపా ప్రభుత్వం నీటిపారుదల శాఖపై నిర్లక్ష్యం వహిస్తుందని దీనివల్ల రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని మరమ్మతుల కోసం రెండు మూడు కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం విడుదల చేయకపోవడం ప్రాజెక్టు పై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించారు గత ఐదు సంవత్సరాల నుండి నిర్లక్ష్యం నీడన మూలన పడ్డ అలగనూరు రిజర్వాయర్ ను టిడిపి ప్రభుత్వం వస్తే ప్రత్యేకంగా చొరవ తీసుకొని ప్రాజెక్టు మరమ్మతు చేయించి నీరు నిలువ చేసి రైతులకు మేలు చేస్తామని హామీ ఇచ్చారు. పాణ్యం ఎమ్మెల్యేగా గౌరు చరిత రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం టిడిపి ప్రభుత్వం అధికారంలో రావడంతో ఈనెల రెండో తేదీ మంగళవారం నాడు అమరావతిలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కలిసి ప్రాజెక్టు స్థితిగతులు మరమ్మత్తులపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే ప్రభుత్వం తరఫున ఇంజనీరింగ్ నిపుణుల బృందాన్ని పంపించి ప్రాజెక్టు స్థితిగతులపై నివేదిక తెప్పించుకుంటానని కచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అలగనూరు ప్రాజెక్టు మళ్లీ పూర్వస్థితికి తెస్తామని హామీ ఇవ్వడంతో ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కృషి చేయడం అభినందనీయం అని నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేకు కొనియాడుతున్నారు. 

About Author