నందికొట్కూరు వైసీపీ కి భారీ షాక్..
1 min readమున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్లు బైరెడ్డి సమక్షంలో టిడిపి లో చేరిక
కేంద్ర రాష్ట్ర నిధులతో పట్టణ అభివృద్ధి
ప్రజా సమస్యలు తెలుసుకుంటా పరిష్కరిస్తా బైరెడ్డి
పట్టణ అభివృద్ధి కోసమే టిడిపి లోకి చైర్మన్ సుధాకర్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది.శుక్రవారం మధ్యాహ్నం నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్వగృహం బైరెడ్డి సమక్షంలో మున్సిపాలిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు చిన్న రాజు,అబ్దుల్ రఊఫ్,సురేష్ తదితరులు టిడిపి పార్టీలో చేరారు.బైరెడ్డిని చైర్మన్ మరియు కౌన్సిలర్ శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బైరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ మున్సిపాలిటీ చైర్మన్ మరియు కౌన్సిలర్లను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నా మీకు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని మీకు ఇంకా 21 నెలలు పదవి ఉందని పట్టణ అభివృద్ధికి ప్రస్తుత టిడిపి నాయకులతో కలుపుకొని పట్టణ అభివృద్ధికి మీరంతా కృషి చేయాలని అదే విధంగా మీతో పాటు నేనూ ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరిద్దామని అన్నారు.పేద ప్రజల కోసం పనిచేయాలని పట్టణంలో ముఖ్యంగా శానిటేషన్ ఇంటింటికీ త్రాగునీరు ముఖ్యమని అభివృద్ధి కొరకు అందరూ కలిసి కట్టుగా ఉండి అభివృద్ధికి పాటుపడాలన్నారు. 1994 నుండి 2004 మధ్యలో అప్పుడు టిడిపి ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంపీ శబరమ్మ నిధులతో అభివృద్ధి చేయడమే నా ఉద్దేశమని మరి ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు కర్నూలు జిల్లా అయితే విద్యా వైద్య తదితర పనుల నిమిత్తం కర్నూలు జిల్లా అందరికీ అందుబాటులో ఉంది నందికొట్కూరును కర్నూలు జిల్లాలో కలపడానికి కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు ఎంపీ శబరమ్మ సహకారంతో పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని బైరెడ్డి కుటుంబం తోనే అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో ఈరోజు టిడిపిలోకి రావడం జరిగిందని కేంద్ర రాష్ట్ర నిధులతో పట్టణం ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఉస్మాన్ బేగ్, లాలూ ప్రసాద్,శ్రీనివాసులు, రమేష్,శాలిమియ్య,బోయ శేఖర్,రామకృష్ణ,గఫార్ మరియు మాజీ జెడ్పిటిసి నాగేశ్వరరావు,గోకారి తదితరులు పాల్గొన్నారు.