ముఖ్యమంత్రుల భేటీలో రాయలసీమ ప్రాజెక్టులపై చర్చించాలి
1 min readఏపీ సీఎం చంద్రబాబు నాయుడు,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల కలయిక గుండ్రేవుల,సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి నాంది పలకాలి.రాయలసీమ రవికుమార్.రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల మధ్య రేపు జరగబోయే భేటీతో ఇరు రాష్ట్రాల నీటి సమస్యలు పరిష్కరమై రాయలసీమ ప్రజల ఆకాంక్షలైన గుండ్రేవుల ప్రాజెక్టు,సిద్దేశ్వరం అలుగు నిర్మాణాలకు అంకురార్పణ జరగాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్, రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న కోరారు.నగరంలోని స్థానిక ఆర్వీపీఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రేపు జరగబోయే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రవహించే కృష్ణ, తుంగభద్ర నదులపై రాయలసీమ-తెలంగాణ మధ్య నిర్మించాల్సిన గుండ్రేవుల ప్రాజెక్టు, సిద్దేశ్వరం అలుగు నిర్మాణాలకు పరిష్కారం చూపాలని, రెండు రాష్ట్రాలు ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారించుకుని ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర,కర్ణాటక జల దోపిడీని ఐక్యతతో అరికట్టాలని అన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ రాయలసీమ,తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గుండ్రేవుల,సిద్దేశ్వరం అలుగు, తెలంగాణ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిస్థాయి నిర్మాణాలు జరిగాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలోనుండి కూడా చెబుతున్నట్టుగానే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి ముఖ్యమంత్రుల భేటీ వేదకవుతుందని రాయలసీమ ప్రజానికం ఆశాభావంతో ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు పీ.అశోక్ పాల్గొన్నారు.