స్వేచ్ఛ, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరులు బాబు జగ్జీవన్ రామ్
1 min readకర్నూల్ జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు తిలక్ గట్టు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం విశ్రమించకుండా సమర శంఖం పూరించిన ధీరులు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్ పేర్కొన్నారు.బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు.డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవిత కాలంలో పేదల కోసం ఎన్నో సేవలు అందించారన్నారు. పార్లమెంటును ఏలిన మహా అనుభవ శీలి. వ్యవసాయ, రక్షణ, ఆరోగ్య, రైల్వేశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా ఆయన సేవలు అనిర్వచనీయమన్నారు. ఇటువంటి మహనీయుడిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయన అడుగుజాడల్లో అందరం నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ కర్నూల్ నియోజకవర్గ అధ్యక్షులు మంద అఖిల్ , TNSF రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బజారన్న , ఐటీడీపీ ఉపాధ్యక్షులు మురళి , ఐటీడీపీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ ,ఐటీడీపీ నియోజకవర్గ సభ్యులు దినేష్ , శ్రీను , చంద్ర శేఖర్ , నగేష్ , సుధాకర్ , మనోజ్ పాల్గొన్నారు.