PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిస్వార్ధ ప్రజా సేవకుడు డా . బాబు జగ్జీవన్ రామ్

1 min read

దళితసంక్షేమసంఘం ఉమ్మడి కృష్ణజిల్లా అధ్యక్షుడు పాతూరి చంద్రశేఖర్

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: భరత జాతి ముద్దుబిడ్డ స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త భారత దేశ తొలి ఉప ప్రధాని నిస్వార్థ ప్రజా నాయకుడు దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్  38వ వర్ధంతి సందర్భంగా ఆయనకు దళిత సంక్షేమ సంఘం ఊమ్మడి క్రిష్ణజిల్లాఅధ్యక్షుడు పాతూరి చంద్రశేఖర్ కుందేరులోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులు అర్పిచటం జరిగింది మహానుభావుడు మన దేశానికి చేసిన సేవలు మరువలేనివి అని హరిత విప్లవ పితామహుడుగా మరియు దేశంలోని అనేక కేంద్ర మంత్రి పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేసిన ఉత్తమ పార్లమెంటేరియన్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అని అలాంటి మహానుభావుల అడుగుజాడల్లో వారి లక్ష్యాలను సాధించడంలో మా వంతుగా  బడుగు బలహీన వర్గాల కోసం దళితుల హక్కుల సాధన కోసం నిరంతరం ప్రజలకు చేరువలో ఉంటoఅని తెలియజేస్తూ మహానుభావుడు సంఘసంస్కర్త సమతవాది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్  అడుగు జాడలను అనుసరించి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో  స్థానిక నాయకులు రావెళ్ళ సంపత్,వల్లూరి ఎసురత్నం ,బట్టు సుబ్రమణ్యం, గన్నవరం నియోజకవర్గ నాయకులు దేవరపల్లిబుజ్జిబాబు, తిరివిధి సుధీర్, విశ్వనాథపల్లి బాబురావు, ఇతర నాయకులు  పాల్గొన్నారు.

About Author