బీరం ఆవరణలో జయప్రదంగా నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : జన్మంతా మోసే నేలతల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము ఒక చిన్న మొక్కని నాటి, నేలమ్మ ఆయుష్షును కాపాడి, కొంచమైనా రుణం తీర్చుకుందాం అని, ప్రకృతి ఒడిలో పచ్చదనానికి నిలువెత్తు అద్దం లాంటి బీరం శ్రీధర్ రెడ్డి విద్యాసంస్థల ఆవరణలో నేడు వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ముందుగా ప్రార్థనాగీతముతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బీరం విద్యా సంస్థల చైర్మన్ సుబ్బారెడ్డిగారు ,చైర్ పర్సన్ సరస్వతమ్మ మాట్లాడుతూ చెట్లు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరమని,భూమిపై చెట్ల వలన పచ్చని వాతావరణం నెలకొనిందని, చెట్లు మానవులకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి చెట్ల వలన గాలి,నీడ,ఆహారం, పండ్లు, కాయలు మరెన్నో లభిస్తాయని కాబట్టి ఎవరూ చెట్లను కొట్టివేయద్దు అన్నారు. మరియు పిల్లలందరికీ మీరు ప్రతి పుట్టినరోజున ఒక చెట్టు నాటండి అని సూచించారు. అలాగే పాఠశాల ఆవరణలో వారు పిల్లలతో కలిసి చాలా మొక్కలు నాటారు.బీరం విద్యాసంస్థల డైరెక్టర్ బీరం స్వాతి శ్రీకాంత్ మాట్లాడుతూ మానవుని మనుగడకు మరియు అనంత జీవుల మనుగడకు చాలా ముఖ్యమైనవి చెట్లు అని, ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే అందుకు మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని, ప్రతి ఒక్కరూ చెట్లు నాటి అంతరించిపోతున్న వృక్ష సంపదను పెంచాలని తెలియజేశారు. మరియు అడవులను విచక్షణారహితంగా నరికి వేస్తున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. వనమహోత్సవం కార్యక్రమంలో విద్యార్థులు చెట్ల ఆవశ్యకత యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మరియు వనమహోత్సవ నినాదాలతో పాఠశాల ఆవరణలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా, కళాశాల ప్రిన్సిపల్ హేమ్ చందర్ ,అధ్యాపకులు, పీ.ఈ.టీలు పాల్గొన్నారు.