పురుగు మందులు , ఎరువుల దుకాణాలు ఆకస్మిక తనిఖీలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద మండలంలోని, విత్తన, పురుగు మందులు , ఎరువుల దుకాణాల యందు వ్యవసాయ కమీషనర్, గూంటూర – ఆదేశాల మేరకు వ్యవసాయ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖల బృందం వారి అద్వర్యంలో పల్నాడు జిల్లాకు చెందిన వ్యవసాయ సహాయ సంచాలకులు వి. హనుమంతరావు మరియు విజిలెన్స్ . ఎన్ఫోర్స్ మెంట్ అధికారి పి. చంద్రశేఖర్ రెడ్డిలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, రికార్డులను పరిశీలించడం జరిగింది.ఈ తనిఖీలలో న్యూ ఈ రలింగేశ్వర ఫర్టిలైజర్స్ నందు స్టాక్ బుక్ సరిగా నిర్వహించకపోవడం వల్ల RS. 3,00,754 లు విలువగల పురుగు మందులకు అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది.. అలాగే ఎత్తు. Rs. 16,550 లు విలువ గల ఎరువుల అమ్మకాలకు తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది.శ్రీ ప్రసన్న ఆంజనేయ విత్తన దుకాణంలో స్టాక్ రిజిష్టర్ సరిగా update చేయక పోవడం వల్ల RS. 1,15,776 లు విలువ గల ప్రత్తి విత్తనాలుకుఅమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మాలి. మరియు గుర్తింపు లేని వాటిని రైతులకు అమ్మితే అలాంటి వారియొక్క దుకాణ లైసెన్సులు రద్దు చేస్తామని తెలియ జేసినారు. ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ మరియు AEO, విరుపాక్షి, MARO నరసింహాలు పాల్గొన్కారు.