జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలి
1 min readనాలుగు మండలాల అధ్యక్షులు ప్రకటన
మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి. లక్ష్మన్న
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మంత్రాలయం నియోజకవర్గం లో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు ఐక్యంగా కృషి చేయాలని మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న పిలుపునిచ్చారు. ఆదివారం మంత్రాలయంలో ఆర్యవైశ్య కళ్యాణమండపంలో మంత్రాలయం, కోసిగి, పెద్దకడబూరు, మండలాల జనసేన నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో జనసేన పార్టీ పటిష్టత కొరకు కృషి చేయాలని కోరారు. ఈరోజు సమావేశానికి రాని నాయకులను, కార్యకర్తలను సముచిత స్థానం కల్పిస్తామని అందరినీ కలుపుకుని ముందుకు పోవడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గం లో జనసేన పార్టీని బలోపేతం చేయాలని జనసైనికులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇంతవరకు జనసేన పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులను ప్రకటించలేదన్నారు. జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్సనల్ ఆఫీసు నుంచి నాకు ఫోన్ రావడం జరిగిందని నాలుగు మండలాల అధ్యక్షుల పేర్లను పంపమని చెప్పడం జరిగిందని తెలిపారు. నేను త్వరలో ప్రకటించి పంపుతానని వారికి చెప్పడం జరిగిందన్నారు. నాలుగు మండలాల అధ్యక్షులను, కన్వీనర్లను ప్రకటించడం జరిగిందని తెలిపారు. కౌతాళం మండల అధ్యక్షులుగా మంజునాథ్, కన్వీనర్లుగా మౌనేష్,సుమిత్ర, అబ్దుల్, లింగన్న, ఎర్రి స్వామి, రమేష్, ఆలం భాష, ఉసేని బాబు, వలి లను, పెద్ద కడుబూరు మండలం అధ్యక్షులుగా బజారి, మండల కన్వీనర్లుగా షర్ఫుద్దీన్, అలీ భాష, మాదేవ్, వీరేష్, రామాంజనేయులు, హుసేని లను, కోసిగి మండలం అధ్యక్షులుగా వీరారెడ్డి, మండల కన్వీనర్లుగా రమేష్, రజాక్, కోసిగయ్య,నాగరాజు లను . మంత్రాలయం మండల అధ్యక్షులుగా రామకృష్ణ, మండల కన్వీనర్లుగా లోకేష్, దేవేంద్ర, ఎం రామకృష్ణ లను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ రోజున కర్నూలు జిల్లా నాయకుడు 30 సంవత్సరాలుగా దళిత ఐక్యవేదిక ద్వారా పోరాటం చేసిన పల్లిపాడు లోకేష్ మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి లక్ష్మణ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగిందని. తెలిపారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ కొరకు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ పటిష్టత కొరకు పాటుపడతానని హర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రాలయం నియోజకవర్గం లో పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రాలయం నియోజకవర్గం లోని నాలుగు మండలాల జనసేన నాయకులు, వందలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు.