ఉచిత ఇసుక పాలసీతో రాష్ట్ర ప్రగతికి బాట
1 min readశ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసితో పేదల సొంతింటి కలలు నెరవేరి, నిర్మాణ రంగం ఉపందుకోనుందని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం అభినందనీయం అన్నారు. ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యులకు భారీ ఊరట లభించనుందని ఇచ్చిన హామీ మేరకు జీవో నం.48 ను విడదల చేసి నెల రోజుల లోపే ఉచిత ఇసుక పాలసీని తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు . రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ రాష్ట్ర ప్రజల ప్రగతే ధ్యేయంగా ఎన్డీయే ప్రభుత్వం ఈ పాలసీ రూపొందించిందని, దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా రాష్ట్ర ప్రజలకు ఉచిత ఇసుక అందిస్తామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు.